Powered by Blogger.

BOMB BLASTS IN MUMBAI

>> Wednesday 13 July 2011

ముంబాయిలో మళ్లీ వరుస బాంబు పేలుళ్లు
10 మంది దుర్మరణం, 100 మందికి గాయాలు ?
వణికిన దాదర్, జవేరీ బజార్, ఓపెరా హౌస్, లెమింగ్టన్ రోడ్

ముంబై, జూలై 13: ముంబాయి నగరం మళ్లీ వరుస బాంబు పేలుళ్లతో వణికిపోయింది. బుధవారం సాయంత్రం 6-30 నుంచి అరగంట వ్యవధిలో దాదర్, జవేరీ బజార్, ఓపెరా హౌస్, లెమింగ్టన్ రోడ్ ప్రాంతాలలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 10మంది దుర్మరణం చెందగా, సుమారు 100 మందికిపైగా గాయపడ్డారని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ముంబాయిలో వరుస పేలుళ్లు సంభవించడంతో ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బాంబు పేలుళ్ళకు నిషేధిత ఇండియన్ ముజాహిద్దీన్‌దే బాధ్యత అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది టెర్రరిస్టుల పనే అని కేంద్ర హోంమంత్రిశాఖ కూడా భావిస్తున్నది.

దక్షిణ ముంబాయిలో ఎప్పుడూ జన సంమర్ధంగా ఉండే దాదర్, జవేరీ బజార్, ఓపెరా హౌస్, లెమింగ్టన్ రోడ్ ప్రాంతాలలో ఈ పేలుళ్లు సంభవించాయి. ప్రసాద్ ఛాంబర్ వద్ద ఒక పేలుడు, రెండోది జవేరీ బజార్ ప్రాంతంలో, మూడోది ఓపెర హౌస్, నాల్గొది లెమింగ్టన్ రోడ్ ప్రాంతాలలో ఈ పేలుళ్లు సంభవించాయి. ముంబాయిలో వజ్రాల వ్యాపారులు అధికంగా ఉండే ఈ ప్రాంతాలలో సంభవించిన బాంబు పేలుళ్లతో ప్రజలు పరుగులు పెట్టారు. పోలీసులు, అగ్నిమాపక దళాలు హుటాహుటిన బాంబు పేలుళ్లు సంభవించిన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేస్తున్నారు.

0 comments:

Post a Comment

About This Blog

Blog Archive

  © Blogger template Webnolia by Ourblogtemplates.com 2009

Back to TOP